Paaఅమితాబ్‌ బచ్చన్‌ పదమూడేళ్ల బాలుడు పాత్రలో నటించిన పా చిత్రం ఈ రోజే(శుక్రకవారం)ప్రపంచమంతటా రిలీజ్ అవుతోంది. అభిషేక్ బచ్చన్ తండ్రిగా, అమితాబ్ ఆయన కొడుకుగా రివర్స్ లో ఈ చిత్రంలో కనిపిస్తారు. ఈ చిత్రంలో అమితాబ్ పాత్ర పేరు ఆరో. ఆ అబ్బాయి ప్రొజేరియా అనే అరుదైన జన్యు సంబంధిత వ్యాధిగ్రస్తుడు. పదమూడేళ్ల బాలుడైనా...అరయ్యేళ్లు పైబడిన వ్యక్తిలా కనిపిస్తాడు. ఆరో తండ్రిగా అభిషేక్‌, తల్లిగా విద్యాబాలన్‌ కనిపిస్తారు. సున్నితమైన భావోద్వేగాలతో సాగే ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. అమితాబ్‌ మేకప్‌, నటన, మనసుని హత్తుకొనే సంభాషణలు 'పా'ను ఓ ఉత్తమ చిత్రంగా నిలబెడతాయని అభి చెబుతున్నారు. ఈ సినిమాని ఏబీ కార్పొరేషన్‌, బిగ్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. దర్శకుడు బాల్కీ చెప్పిన పాత్రను అమితాబ్ సవాల్‌గా తీసుకున్నారు. కాబట్టే... 'పా' సిద్ధమైంది అని చిత్ర వర్గాలు చెప్తున్నారు. బాల్కీ గతంలో అమితాబ్, టబు కాంబినేషన్లో చీనీకామ్ చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.


0 comments

Post a Comment

www.localneeds.in

Watch Yamudu movie Tralier

I News LIVE

Watch Ravi Babu's Prathi Roju Movie Trailer

Watch Alladista Movie Trailer

ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....

.