Aishwarya Rai

ఇప్పటిదాకా నేను ఎవ్వరికి చెప్పని విషయం ఒకటుంది...అదేమిటంటే...నేను, అభిషేక్‌ ఎప్పుడూ కూడా విక్రమ్‌ ఎదుట భార్యాభర్తల్లా వ్యవహరించలేదు. మేం భార్యభర్తల్లా కనపడిన పక్షంలో నాకు జోడీగా నటించటంలో విక్రమ్‌ ఇబ్బంది పడి ఉండేవారేమో అంటూ చెప్పుకొస్తోంది ఐశ్వర్యారాయ్. ఈ రోజు రిలీజవుతున్న 'రావణ్‌' చిత్రం గురించి చెబుతూ ఐశ్వర్యా ఇలా స్పందించింది. ఆమె మాటల్లోనే...అభిషేక్ ‌తో కలిసి 'రావణ్‌' చిత్రంలో నటించటం నాకు మంచి అనుభవం లాంటిది. అది నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. అభిషేక్‌ కూడా ఇలాగే ఫీల్‌ అవుతుంటాడు. రొటీన్‌ భిన్నంగా వెరైటీ తారాగణంతో రూపొందిస్తున్న ఇలాంటి సినిమాలో నటించేందుకు నాకు అవకాశమిచ్చిన మణిరత్నం గారికి పర్సనల్‌గా థ్యాంక్స్‌ చెప్పుకుంటున్నా అంది. అలాగే తన పాత్ర గురించి చెబుతూ..గతంలో నేను నటించిన 'ఇద్దరు' చిత్రంలో పుష్ప, 'గురు' లో కల్పన కన్నా స్వతంత్రభావాలను కలిగిన విభిన్న వ్యక్తిత్వానికి రాగిణి ప్రతినిధి. పూర్తి మహిళకు ప్రతిరూపం. అవసరమైతే అపరకాళిక అవతారంలో కూడా కనిపిస్తుంది. అలాంటి పాత్రలో నటించటం నటిగా నాకు సంతృప్తిని ఇచ్చింది అందిఐశ్వర్యారాయ్

0 comments

Post a Comment

www.localneeds.in

Watch Yamudu movie Tralier

I News LIVE

Watch Ravi Babu's Prathi Roju Movie Trailer

Watch Alladista Movie Trailer

ఆంధ్రప్రదేశ్ మీడియా కబుర్లు....

.